ట్విట్టర్‌లో మ‌రో సరికొత్త ఫీచర్..! ఫాలోవ‌ర్‌ను బ్లాక్ చేయ‌కుండానే తొల‌గించొచ్చు

N ANJANEYULU
సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్విట్ట‌ర్ మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్‌ను  తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది.  ట్విట్ట‌ర్ అకౌంట్ బ్లాక్ చేయ‌కుండానే.. ఈ ఫీచ‌ర్ ద్వారా ఫాలోవ‌ర్‌ను తొల‌గించ‌వ‌చ్చు. ఎలాగంటే..? మీ టైమ్‌లైన్‌, ట్వీట్స్‌ల‌ను యూజ‌ర్లు ఎవ‌రైనా చూడ‌వ‌ద్ద‌ని మీరు అనుకున్న‌ట్ట‌యితే ఈ ఫీచ‌ర్‌ను వినియోగించ‌వ‌చ్చు. వారికి మీకు సంబంధించి ట్వీట్స్ క‌నిపించ‌వు.
ఇంత‌కు ముందు తాము చేసే ట్విట్స్, త‌మ ప్రొఫైల్ పిక్చ‌ర్ త‌మ‌కు న‌చ్చ‌ని వ్య‌క్తుల‌కు క‌నిపించ‌కుండా ఉండాలంటే వారిని బ్లాక్ చేయాల్సిన ప‌రిస్థితి ఉండేది. కానీ కొంద‌రూ బ్లాక్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డేవారు కాదు. త‌మ ఫీడ్ మాత్రం క‌నిపించ‌వ‌ద్ద‌ని భావిస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ ఫీచ‌ర్ క‌చ్చితంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే చెప్పాలి. స్టాప్ బ్లాకింగ్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచ‌ర్ ద్వారా ఫాలోవ‌ర్స్‌పై ట్విట్ట‌ర్ యూజ‌ప‌ర్ గ్రిప్ పొందొచ్చు. దీని ద్వారా ట్రోలింగ్ నుంచి త‌ప్పించుకోవ‌డం, ప్రైవ‌సీని కాపాడుకోవ‌డం వంటివి చేయ‌వ‌చ్చు.
దీనిని ఎలా ఉప‌యోగించాలంటే..?  ముందుగా  కంప్యూట‌ర్‌, మొబైల్ యాప్‌లో ట్విట్ట‌ర్ అకౌంట్ లాగిన్ అయిన త‌రువాత ప్రొఫైల్ సెక్ష‌న్‌లోకి వెళ్లాలి. ఫాలోవ‌ర్స్ లిస్ట్ ఓపెన్ చేయాలి. ఎవ‌రినైతే వ‌ద్దు అనుకుంటారో వారిని ఎంపిక చేసుకుని పేరు ప‌క్క‌నే ఉన్న త్రీడాట్స్ మెనూ టాప్ చేయాలి. త‌రువాత ఆప్ష‌న్‌లో రిమూవ్ ద ఫాలోవ‌ర్ ని క్లిక్ చేయాలి. ఒక‌సారి ఇలా చేస్తే ఆ ఫాలోవ‌ర్‌ సంబంధించిన జాబితా నుంచి మాత్ర‌మే తొలిగిపోతాడు. అయినా తాను మాత్రం ప్రొఫైల్‌, ట్వీట్స్‌ను చూడ‌గ‌లుగుతారు. కానీ  వ‌ద్ద‌నుకుంటే మాత్రం స‌ద‌రు ఫాలోవ‌ర్‌ను బ్లాక్ చేయాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: