శుక్రవారం కురిసిన మెరుపులతో కూడిన భారీ వర్షాల కారణంగా పలు చోట్ల ఉరుములతో కూడిన పిడుగులు పడ్డాయి. భారీవర్షాలకు వాగులు వంకలు నిండి పొంగి పొర్లాయి. నారాయణ్ పెట్ జిల్లా లోని ముక్తల్ మండలం లోని రుద్ర సముద్రం లో గొర్రెల గుంపు పై పిడుగు పడింది. ఈ పిడుగు పాటుకు దాదాపుగా 73 గొర్రె పిల్లలు అక్కడికక్కడే మరణించాయి. రుద్రా సముద్రం గ్రామం చుట్టుపక్కల ఉన్నా పలు చోట్ల పిడుగు పటు సంభవించింది.
అయితే గొర్రె పిల్లల పై పిడుగు పడటం తో గొర్రెల కాపరులు తమ ఆవేదన ని వ్యక్తం చేస్తున్నారు. గొర్రె ల యజమానులు జాంబయ్యలు, మల్లప్ప,అంజలప్ప, సాయన్న, పిడుగు పడిన విషయాన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాదాపుగా ఐదు లక్ష లకు పైగా విలువ చేసే గొర్రె పిల్లలు మరణించినట్లు గొర్రెల యజ మానులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వమే తమని ఆదుకోవలసింది గా గొర్రెల యజ మానులు కోరుతున్నారు