నామినేషన్ వేళ హుజూరాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈటెల రాజేందర్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆయన తరపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుజూరాబాద్ చేరుకున్నారు. అంతే కాకుండా భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు కూడా హుజూరాబాద్ నామినేషన్ కోసం చేరుకున్నారు. అయితే ఇదే రోజు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నారు.
దాంతో రేవంత్ రెడ్డి కూడా హుజూరాబాద్ నామినేషన్ కోసం వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా భారీగా చేరుకోగా పోటా పోటీగా నినాదాలు చేస్తున్నారు. దాంతో నామినేషన్ కేంద్రం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొనడం తో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఇదివరకు హుజూరాబాద్ ఫైట్ లో ఇప్పటి వరకు బీజీపీ టీఆర్ ఎస్ మాత్రమే చురుగ్గా కనిపించగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా వచ్చి చేరింది. దాంతో హుజూరాబాద్ ఎన్నికల పై తెలంగాణ లో మరింత ఆసక్తి నెలకొంది.