అవి నేరుగా వారి చేతికే..?

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గురువారం ఒంగోలులో రెండో విడుత ఆస‌రా కార్య‌క్ర‌మం ప్రారంభించారు.  ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. నేటి నుంచి ఈనెల 18 వ‌ర‌కు ఆస‌రా ఉత్స‌వాలు జ‌రుగుతాయి.  ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా 13 నుంచి 15 వ‌ర‌కు ఆస‌రా ఉత్స‌వాలు ఉండ‌వు. 78.76 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు 6,439 కోట్లు కేటాయించిన‌ట్టు వెల్ల‌డించారు. స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌ను రుణ‌మాఫీ చేస్తాన‌ని హామీ ఇచ్చాడు. అక్కా చెళ్లెల్ల అభివృద్ధికి ఎంత స‌హాయం చేసిన త‌క్కువే అన్నారు. ఎన్నిక‌ల కార‌ణంగా క‌డ‌ప జిల్లాలో ఆస‌రా కార్య‌క్ర‌మం లేద‌న్నారు. న‌వంబ‌ర్ నెల‌లో క‌డ‌ప జిల్లాలో ఆస‌రా ఉత్స‌వాలు జ‌రుగుతాయ‌ని వివ‌రించారు. నేరుగా ల‌బ్దిదారుల చేతి అంద‌జేస్తున్న‌ట్టు తెలిపారు. స‌హాయ సంఘాల కార‌ణంగా రాష్ట్రంలో 0.73 ఆస్తులు మాత్ర‌మే ఉన్నాయ‌ని చెప్పారు. ఇప్పుడు 99.5 శాతం న‌మోద‌వుతాయ‌ని వివ‌రించారు. చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మి అప్ప‌ట్లో డ్వాక్రా మ‌హిళ‌లు అప్పుల పాల‌య్యార‌ని గుర్తు చేశారు. గ‌త ప్ర‌భుత్వంలో సీ గ్రేడ్‌, డీ గ్రేడ్‌కు దిగ‌జారిన డ్వాక్రా సంఘాలు ఇప్పుడు ఏ గ్రేడ్‌కు వ‌చ్చాయ‌ని వెల్ల‌డించారు. 61 ల‌క్ష‌ల మందికి పింఛ‌న్ ఇస్తున్నాం. 1450 కోట్లు ప్ర‌భుత్వానికి ఖ‌ర్చు అవుతుంది. నేరుగా విక‌లాంగుల చేతుల్లో పెడుతున్న‌ట్టు వివ‌రించారు. ఇళ్ల నిర్మాణం ప‌థ‌కం 31 ల‌క్ష‌ల మంది 2 నుంచి 3 ల‌క్ష‌ల కోట్ల సంపాద‌న వారి చేతిలో పెట్ట‌డం జ‌రుగుతుంది.
 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: