జగన్ ఢిల్లీ టూర్ ఫైనల్...?

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. పది రోజుల క్రితం సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వెళ్లాల్సి ఉన్నా సరే కొన్ని కారణాల వల్ల ఆ పర్యటన వాయిదా పడింది. త్వరలోనే జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి జగన్తో పాటు మంత్రులు కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అయితే ప్రధానమంత్రి బిజీగా ఉండటంతో జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడుతూ వస్తుంది అంటున్నారు. జల వనరులకు సంబంధించి కూడా కేంద్ర జల శక్తి శాఖ మంత్రితో ఆయన భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీడియా వర్గాలు అంటున్నాయి. ఈ నెల మూడోవారంలో జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: