ఏపీసీఎంఓ ఓ మండల ఎంపీపీ స్థానానికి ఎవరిని ఎన్నుకోవాలో అన్నది నిర్థారిస్తూ ఫోన్ కాల్ చేసింది. ఇదంతా శ్రీకాకుళం జిల్లా, నందిగాం మండలానికి చెందిన పరిణామం.
దువ్వాడ శ్రీనివాసరావు అనుకున్న విధంగా ఈ సారి విజయం లేదు. ఎమ్మెల్సీ పదవి ఉందన్న ఆనందంలో ఆయన ఏమయినా మాట్లాడవచ్చు కానీ అందుకు అనుగుణంగా రాజకీయం లేదు. దీంతో నందిగాం మండలం (వివాదాలకు తావిచ్చిన ఎంపీపీ పదవి) ఎంపీపీ పదవి విషయమై సీఎంఓ జోక్యం చేసుకుంది. సీఎంఓ కాల్ చేసి మరి నందిగాం మండలం ఎంపీపీగా నడుపూరి శ్రీరామూర్తి పేరును ఖరారు చేసింది. ఈయన గతంలో సాక్షి విలేకరిగా నందిగాం మండలంలో పనిచేశారు. ఈయనకు దువ్వాడ వ్యతిరేక వర్గం మద్దతు ఉంది. దీంతో దువ్వాడ ప్రవర్తనతో విభేదిస్తున్న పేడాడ తిలక్ వర్గం ఆనందోత్సాహాల్లో ఉంది. కష్టపడి పని చేసే వాడికి ఈ పార్టీ లో ఎప్పుడు సముచిత స్థానం ఉంటుంది అనడానికి నిదర్శనం ఈ తీర్పు అని కూడా అంటో్ంది.
జిల్లా పెద్దలు అందరికి ధన్య వాదాలు అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు ఉంచింది. చివర్లో జై జగనన్న అన్న మాటతో ముగించారు ఈ సందేశాన్ని. దీంతో గత కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు కాస్త తెరపడింది. ఎమ్మెల్సీ హోదాలో దువ్వాడ చేసిన వ్యాఖ్యలు ఏవీ నెగ్గుకు రాకుండా పోయా యి. శ్రమను నమ్ముకుని పార్టీ కోసం పనిచేసిన వారికే పట్టం అని తేలిపోయింది. అదేవిధంగా పేడాడ తిలకపై సోషల్ మీడియా వేది కగా దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలను కూడా సీఎం పెద్దగా పట్టించుకోలేదు. పేడాడ తిలక్, మాజీ మంత్రి అచ్చెన్నతో కలిసి పనిచేస్తున్నారన్న అభియోగం ఒకటి దువ్వాడ చేసినప్పటికీ దీన్ని కూడా అధిష్టానం పెద్దగా పరిగణించలేదు.