కరెంట్ బిల్లు కట్టలేదని ఫోన్ వచ్చిందా...? అయితే...?

సైబర్ నేరాలు ఇప్పుడు తెలంగాణాలో సంచలనంగా మారాయి. ఎప్పుడూ కూడా ఏదోక నేరం జరుగుతూనే ఉంది. ఎస్బిఐ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కు టోకరా వేసి ఆరు లక్షల వరకూ కేటుగాళ్ళు కాజేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఆన్ లైన్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించిన బాధితుడికి ఫోన్ చేసిన కేటుగాళ్లు... మీ బిల్లు చెల్లింపు అప్డేట్ కాలేదని యాప్ ద్వారా అప్డేట్ చేసుకోవాలని చెప్పినట్టు తెలిసింది.
 టీఎస్ ఎస్పీడీసీఎల్,  క్విక్  సపోర్ట్   యాప్స్ లింకులను  బాధితుడి మొబైల్ కు పంపించారు. క్విక్  సపోర్ట్ యాప్ ఓపెన్ చేసి డెబిట్ కార్డు వివరాలు నమోదు చేయగానే  పలు విడతలుగా 10 నిమిషాల్లో 5.80 లక్షలు  తమ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్కున్నారు. సిటీ సైబర్  క్రైమ్స్ లో  శివరామకృష్ణ శాస్త్రి ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: