బిగ్ బాస్ 5 : వివాదస్పద కామెంట్స్ తో రచ్చ చేసిన ప్రియ..

Purushottham Vinay
ఇక బిగ్ బాస్ 5 గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజు రోజుకి చాలా ఉత్కంఠభరితంగా ఇంకా అలాగే వివాదస్పదంగా సాగుతుంది. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో ప్రోమో చాలా ఆసక్తికరంగా వుంది. ఇక ఇప్పటికీ రెండు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 5 రోజు రోజుకి వివాదస్పదమవుతుంది.ఇక ఇంటి సభ్యులు బూతులు కొట్లాటతో రెచ్చిపోతున్నారు. ఇక తాజాగా విడుదల అయిన ప్రోమోలో రవికి, ప్రియకి, లహరికి మధ్య పెద్ద రచ్చ జరిగినట్లు తెలుస్తుంది. ప్రియ లహరిని నామినేట్ చేస్తూ రవి తో మానస్ తో లింక్స్ పెట్టడం జరిగింది.

 మీరు ఎందుకు నాకు దూరంగా వుంటున్నారు అని లహరి అడగడంతో ప్రియ నువ్వు హౌస్ లో అందరి అబ్బాయిలతో బిజీగా వున్నావ్ అని సంచలన కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో రవీతో, మానస్ తో లహరీకి ప్రియ లింక్ పెట్టింది. దాంతో రవికి కోపం వచ్చి ప్రియా పైన సీరియస్ అవ్వడం అలాగే లహరీ కూడా ప్రియాపై సీరియస్ అయ్యి ఏడవటం మనం ప్రోమోలో చూడవచ్చు. మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూడాలి.


 https://youtu.be/sFtRvQVjuOE

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: