బ్రేకింగ్: అధికారులపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు ఈ మధ్య కాలంలో అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో అసహనంగా ఉన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారం కూడా గతంలో వారి లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేసారు. అటు నెల్లూరు జిల్లాలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక ఇప్పుడు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఉపాధి హామీ పనుల పై సమీక్షలు లేవు అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్యేలతో కలసి మీటింగ్ లు పెడితే బాగుంటుంది అని అన్నారు. అసలు ఏం పనులు జరుగుతున్నాయో అర్దం కాని పరిస్థితి అని ఆరోపించారు. ఓ గ్రామం లో గతంలో ఏ పనులు జరిగాయి... ఇప్పుడు ఇంకా ఏం చేయాలనే ప్రణాళిక ఉండాలి అన్నారు. గ్రామాలలో మమ్మల్ని ప్రజలు పనులు అడుగుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: