సాయి ధరమ్ తేజ్ సేఫ్ ?
హైద్రాబాద్, కేబుల్ బ్రిడ్జిపై స్పోర్ట్స్ బైక్ నడుపుతూ అదుపు తప్పడంతో గాయాలు పాలైన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని మెడీ కవర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తలకు హెల్మట్ ఉండండంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. మరో రెండుగంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాక, ఆయన ఆరోగ్యంపై పూర్తి స్పష్టతకు రాగలమని చెప్పారు. తలకు బలమైన గా యాలేమయినా అయ్యాయేమో అన్న అనుమానంతో స్కా నింగ్ కు ప్రిఫర్ చేశామని అన్నారు. ఆయన పొట్టపై, కుడి కన్ను,ఛాతీపై గాయాలు ఉన్నాయని, అవన్నీ స్వల్ప గాయాలేనని, వీటి విషయమై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని చెప్పారు. ఇ దిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిందన్న వా ర్త తెలిసి హుటాహుటిన పవన్ కల్యాణ్ ఆస్పత్రికి చేరుకున్నారు. అదే విధంగా మెగాభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రా ర్థిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పోస్టు చేస్తున్నారు. కాగా.. ప్ర మాదం అయిన సమయంలో కేబుల్ బ్రిడ్జిపై పరిమితికి మించిన వేగంతో వెళ్తున్నప్పటికీ హెల్మెట్ ఉండడంతో తలకు గాయాలు కాలేదని తెలుస్తోంది. మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.