అనూషా కేసు నిందితుడి ని వెంటనే అరెస్ట్ చేశాం : ఐజీ

నరసరావుపేట కు చెందిన అనూషా కేసు నిందితుడిని వెంటనే అరెస్ట్ చేశామ‌ని గుంటూరు ఐజీ త్రివిక్ర‌మ్ శ‌ర్మ తెలిపారు. అనూషా కేసులో సకాలంలో చార్జ్ సీటు కూడా వేశామ‌ని త్రివిక్ర‌మ్ శ‌ర్మ తెలిపారు. కొంత మంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఐజీ మండి ప‌డ్డారు. దిశా చట్టం స్పూర్తి తో
7 రోజుల్లోపు 1600 కేసుల్లో చార్జ్ సీట్లు వేశామ‌ని త్రివిక్ర‌మ్ శ‌ర్మ వెల్ల‌డించారు. ప్రతి కోర్టు కు ఓ పీపీ ఉండి  ఈ కేసులన్నీ పర్యవేక్షణ చేస్తుంటారని ఐజీ స్ప‌ష్టం చేశారు.


దిశా చ‌ట్టం ఓ గొడుగు లాంటిదని...దిశా ఓ స్పూర్తి...ఈ గోడుగు లో చివరి అంశమే చట్టమంటూ ఐజీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో దిశ చ‌ట్టంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్న సంగ‌తి తెసిందే. దిశ చ‌ట్టం అస‌లు చ‌ట్ట‌మే కాదంటూ ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తూ మండి ప‌డుతున్నాయి. మ‌రో వైపు పోలీసులు మాత్రం దిశ చ‌ట్టం వ‌ల్ల నింధితుల‌కు శిక్ష ప‌డుతుందని..దిశ యాప్ స‌హాయంతో ఎంతో మందిని స‌మయానికి ర‌క్షించ‌గ‌లిగామ‌ని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: