తెలుగు నటుడు
విశ్వ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని వ్యక్తి ఏమి కాడు. ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి కొనసాగుతున్నాడు. చాలా సినిమాల్లో
విశ్వ నటించాడు. అలాగే పలు సీరియల్లో కూడా
విశ్వ నటించాడు. ఆకట్టుకునే అందంతో
విశ్వ లేడీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక బాడీ బిల్డర్ గా కూడా
విశ్వ బాగా ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.
విశ్వ కేవలం నటుడు మాత్రమే కాదు. మంచి
క్రికెట్ ప్లేయర్ కూడా.
ఇక గతంలో సెలెబ్రేట్
క్రికెట్ లీగ్ లో తన అద్భుతమైన ఆట తీరుతో
విశ్వ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఇక అప్పట్నుంచి
విశ్వ చాలా బాగా పాపులర్ అయ్యాడు. తరువాత కొన్ని సినిమాలు చేసిన తరువాత అవకాశాలు కోల్పోయాడు. తరువాత ఒక సీరియల్ లో కూడా నటించాడు.ఇక అప్పుడప్పుడు బుల్లి తెరపై కూడా సందడి చేస్తూ ఉంటాడు. ఇక గతంలో
జబర్దస్త్ స్టేజ్ పై కూడా
విశ్వ బాగా ఎంటర్టైన్ చేశాడు.ఇక ఇప్పుడు
బిగ్ బాస్ సీజన్ 5 లో ఎంటర్టైన్ చెయ్యడానికి సిద్ధమయ్యాడు.ఇక 14 వ
హౌస్ మేట్ గా
హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.మున్ముందు తన ఆట తీరుతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.