జీడిమెట్ల ప‌రిస‌ర ప్రాంతాల వారికి చెరువు గండం..!

ప్ర‌తిరోజూ కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు నిండిపోయింది . ఫాక్స్ సాగర్ చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం 37 అడుగులు కాగా ప్రస్తుతం ఫాక్స్ సాగర్ లో 28అడుగుల మేర నీరు నిండుకుంది . చెరువులోకి భారీ వ‌ర్షపు నీరు చేర‌డంతో కట్టల పై వరకు వర్షపు నీరు చేరుకుంది . గతేడాది వర్షాకాలంలో 33 అడుగులకే ఫాక్స్ సాగ‌ర్ చెరువు క‌ట్ట‌లు తెగిపోయాయి . 

క‌ట్ట‌లు తెగ‌టందో గతేడాది జీడిమెట్ల, సుభాష్ నగర్ మ‌రియు కుత్బుల్లాపూర్ ప్రరిసర ప్రాంతాల‌న్నీ నీట మునిగిపోయాయి . మ‌రోవైపు మూడు నెలల పాటు ఉమామహేశ్వర కాలనీ నీటిలోనే మునిగిపోయింది . ఈ నేప‌థ్యంలో అధికారులు ఇప్ప‌టికే అప్రమ‌త్త‌మయ్యారు . ఆయా కాల‌నీల ప్ర‌జ‌లు ఆవేద‌న వ్యక్తం చేయ‌డంతో ఎగువ ప్రాంతాల నుండి వచ్చే నీటిని అధికారులు కిందకి విడుదల చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: