ఉద్యోగులకు కేసీఆర్ సూపర్ గుడ్ న్యూస్
సెక్షన్ ఆఫీసర్లుగా 59 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ప్రమోషన్ వస్తుండగా అసిస్టెంట్ సెక్రెటరీలుగా 33 మంది సెక్షన్ ఆఫీసర్లు, డిప్యూటీ సెక్రెటరీలుగా 20 మంది అసిస్టెంట్ సెక్రెటరీలు పదోన్నతులు పొందుతారు. జాయింట్ సెక్రెటరీలుగా 8 మంది డిప్యూటీ సెక్రెటరీలకు ప్రమోషన్ వస్తుంది. అడిషనల్ సెక్రెటరీలుగా నలుగురు జాయింట్ సెక్రెటరీలకు పదోన్నతులు లభిస్తాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.