చింతమనేని రిలీజ్... అసలు మేటర్ ఏంటి అంటే...?

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని నిన్న పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. టీడీపీ నేతలు అందరూ ఆయనను అరెస్ట్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. తాజాగా చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు విడిచి పెట్టారు. దీనిపై ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. దెందులూరులో యస్ ఐ తో కొంత వాగ్వాదం జరగడం వాస్తవమే అన్నారు ఆయన.

నన్ను నర్సీపట్నం వద్ద అరెస్టు చేసి,  మా ఇంటి దగ్గర వదిలారు  అని వివరణ ఇచ్చారు. 41 నోటీసు ఇచ్చారు  అని చింతమనేని పేర్కొన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా  ఇంత దానికి అంత చేసారు అని ఆయన అసహనం వ్యక్తం చేసారు. ఇది రాక్షసత్వం,  రాక్షసపాలన  అని విమర్శలు చేసారు. ఇక ఆయనను విడుదల చేయడం పట్ల టీడీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: