హైదరాబాద్ లో అధికారులకు షాక్ ఇస్తున్న జనం...?
హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ లో 100% వ్యాక్సినేషన్ డ్రైవ్ కు రెస్పాన్స్ నిల్ అని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటి వ్యాక్సినేషన్ లో టీకా తీసుకోవడానికి పాతబస్తీ ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. జిహెచ్ఎంసి ఇంటింటి సర్వేలో నాట్ విల్లింగ్ అంటూ ఓల్డ్ సిటీ ప్రజలు సమాధానం ఇవ్వడం అధికారులకు తలనొప్పిగా మారింది. మొఘల్ పుర, చంద్రయాణ గుట్ట, కార్వాన్, యాకుత్ పుర, మలక్ పేట్ లో మందకొడిగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుందని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.