ఒడిస్సాలో పతీ సహగమనం..భార్యతో పాటే భర్త కూడా.. !

ఒకప్పుడు మన దేశంలో సతీసహగమనం ఉండేది. అంటే భర్త చనిపోతే అతడితో పాటు భార్య కూడా చితి లోకి వెళ్లాల్సిందే. రాను రాను ఆ దురాచారాన్ని రూపుమాపారు. అయితే తాజాగా ఒరిస్సాలో పతీ సహగమనం జరిగింది. ఒరిస్సాలోని కలహండి జిల్లాలో తన భార్య చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన భర్త చితిలోకి దూకి చనిపోయాడు. శైలు జోడీ గ్రామానికి చెందిన రాయబారి (60), నీలమణి (60) భార్యా భర్తలు.


మంగళవారం భార్య నీలమణి గుండె పోటు తో మరణించింది. దాంతో మృత దేహాన్ని స్మశానానికి తీసుకువెళ్ళి చితికి నిప్పు అంటించారు. అనంతరం అందరూ ఇంటికి వెళుతుండగా...ఆమె భర్త రాయబారి వెనక్కి వచ్చి భార్య చితిలో దూకేశాడు. దాంతో అందరూ చూస్తుండగానే భార్య శవం తో పాటు అతడు కూడా కాలిపోయాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఒక భర్త తన భార్యను ఇంతలా ప్రేమించాడా అని అనుకుంటున్నారు. భార్యలను ద్వేషించే ఎంతోమంది భర్తలు అతడిని చూసి నేర్చుకోవాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: