హైదరాబాద్‌లో దారుణం జరిగింది. వ్యాపారిని సాటి మిత్రులే కిడ్నాప్ చేసి హతమార్చిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. చార్మినార్‌కు చెందిన వ్యాపారవేత్త మధుసూదన్‌రెడ్డి కిడ్నాప్, హత్యకు గురయ్యాడు. ఈనెల 19న వ్యాపారి మధుసూదన్‌రెడ్డిని ఆయన మిత్రులే కిడ్నాప్ చేశారు. ఆయన నుంచి వారు 40 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన వ్యాపారిని సాటి స్నేహితులే అపహరించారు.
చార్మినార్ నుంచి వ్యాపారిని కిడ్నాప్ చేసి సంగారెడ్డికి తీసుకెళ్లి హతమార్చారు. అక్కడ పొలంలో మధుసూదన్‌రెడ్డి మృతదేహాన్ని పాతిపెట్టారు. వ్యాపారి కనిపించడం లేదన్న ఫిర్యాదుతో
చార్మినార్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. విచారణలో నలుగురి ప్రమేయం ఉన్నట్లు తేల్చారు. నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. కాగా హత్యకు గురైన మధుసూదన్‌రెడ్డి గతంలో పలు
హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో హతమార్చారా? లేక పాత కక్షలు కారణమా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.