అధ్యక్షా ! : అసెంబ్లీ ఎప్పుడంటే?
మరో వారంలో షెడ్యూల ఖరారు అయ్యే ఛాన్స్
ఏపీలో మరో సభా సమరం మొదలుకానుంది. ఇందుకు సంబంధించి వైఎస్ జగన్ సమాయత్తం అవుతున్నారు. సభకు చెప్పాల్సి నవి, సభ ద్వారా చెప్పించాల్సినవి చాలా ఉన్నాయి అని ఆయన అభిప్రాయపడుతున్నారు. కరోనా కారణంగా కేంద్రం నుంచి రా ష్ట్రానికి నిధులు రావాల్సినంత రాకపోయినా అప్పుల రూపంలో అయినా తమకు సాయం చేయకపోగా,మొండి వైఖరితో అడ్డుకో వడంపై సీఎం ఈ సభలో తన ఆవేదన వెల్లడించనున్నారు. అదేవిధంగా వర్షాకాల సమావేశాలు కాస్త ఎక్కువ రోజులు ఉండేందుకే ఆయన మొగ్గు చూపుతున్నారు..అని సమాచారం. మంత్రులు అవగాహన రాహిత్యం కారణంగా గతంలో పలు సార్లు ఇబ్బందులు పడిన కారణంగా ఈ సారి అలాంటి తప్పులు పునరావృతం కావొద్దని సీఎం సూచిస్తున్నారు. సభలో మాట్లాడేవారంతా పూర్తిగా అధ్యయనం చేసి రావాలని, దిశ చట్టంపైనా, సచివాలయ వ్యవస్థ తీరుపైనా., అదేవిధంగా పాడి పరిశ్రమకు సంబంధించి రాష్ట్రం అమూల్ డైయిరీతో చేసుకున్న ఒప్పందాలపైనా ఇంకా ఇంకొన్ని నిర్ణయాలపైనా బాగా అధ్యయనం చేయాలని కోరుతున్నారు సీఎం. మరోవైపు టీడీపీ నుంచి గోరంట్ల రాజీనామా చేసి బయటకు వస్తే ఆయనను స్వతంత్ర అభ్యర్థిగా గుర్తించాలని స్పీకర్ ను కోరనున్నారు సీఎం. ఇప్పటికే సభలో వల్లభనేని వంశీ స్వతంత్ర సభ్యుడిగానే ఉంటూ, వైసీపీతో బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇదే తరహాలో గోరంట్లనూ గుర్తించేందుకు ఛాన్స్ ఉంది.