పులిచింతల 16వ గేటు విరిగిపోయిన సంగతి తెలిసిందే. దాంతో ప్రకాశం బ్యారేజీ వద్దకు భారీగా వరదనీరు చేరుతుంది. పులిచింతల నుండి దాదాపు 5లక్షల క్యూసెక్కులకు పైగా నీరు రావడంతో బ్యారేజీ దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రటించారు. ఇప్పటికే అక్కడ ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు . ఇక గేటు మరమత్తుల కోసం పులిచింతల ప్రాజెక్ట్ నీటిని వదలడంతో ప్రకాశం బ్యారేజీ వద్దకు భారీగా నీరు చేరుతోంది .
మద్యాహ్నం వరకే 59వేల క్యూసెక్కుల నీటిని వదిలినట్టు అధికారులు చెబుతున్నారు. ఇక నీటి ప్రవాహం పెరగటంతో ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను ఎత్తేసి నీటిని వదిలారు. నీటి ప్రవాహం అధికం అవుతుండటంతో కృష్ణలంక, రామలింగేశ్వర్‌నగర్ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కృష్ణా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని క్రిష్ణా జిల్లా కలెక్టర్ సూచించారు .