టీడీపీ తీరు వలకబోసి ఎత్తుకుంటున్నట్టు ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి అన్నారు. సీనియర్ రాజకీయ నాయకులు చంద్రబాబు కు ఈ సామెత సరిగ్గా సరిపోతుందన్నారు. నిన్న కొన్ని తీర్మానాలు చేశారని..అందులో పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించిన అంశం కూడా ఉంటుందన్నారు. వీళ్ల దీక్షలు జూమ్ మీటింగ్ లు ట్విట్టర్ పోస్ట్ లు అంటూ వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. అప్పట్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినందుకు చంద్రబాబు ఆర్టీసీ ధరలను పెంచి ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. సంక్షభం సమయంలోనూ జగన్ ఎవరి పైనా భారం లేకుండా పాలిస్తున్నారని చెప్పారు.
ప్రతిపక్షంలో ఉన్నామనకుని విమర్శించడంలో తప్పులేదని కానీ మీరు చేసింది మర్చిపోయారా చంద్రాబాబు అంటూ నిలదీశారు. 2015 ఫిబ్రవరిలో చంద్రబాబు ఓ జీవో తెచ్చి పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ పెంచి ధరలు పెంచిదని చెప్పారు. ఆ రోజు నాలుగు రూపాయలు పెంచడానికి అసలు కారణం లేదన్నారు. అప్పుడు ఈనాడు, ఆంద్రజ్యోతి తప్ప మిగితా మీడియా మొత్తం ప్రశ్నించిందని చెప్పారు. వీళ్ల ప్రభుత్వం ముగిసిపోయేసరికి వందకు దగ్గరగా దరలు పెరిగాయని అన్నారు.