అసలు కేటీఆర్ ఎవరు...? మహిళలు అంటే ఆయన దృష్టిలో...?: షర్మిల

తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ షర్మిల ఈ రోజు మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. వాటర్ బోర్డులను కేసిఆర్ ఎప్పుడైనా సీరియస్ గా తీసుకున్నారా అని నిలదీశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అంటూ షర్మిల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హితవుపలికారు. తెలంగాణలో వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత మలిదశ ఉద్యమం మొదలైందని... తెలంగాణ ఇవ్వొద్దని తానెప్పుడూ చెప్పలేదని షర్మిల కాస్త ఘాటుగానే స్పందించారు.

మహిళలను కెసిఆర్ గౌరవించడం లేదని దళితులకు ఎంతమందికి భూములు ఇచ్చారని షర్మిల నిలదీశారు. అసలు కేటీఆర్ అంటే ఎవరు అని ఆమె ప్రశ్నించడం గమనార్హం. మహిళలకు కెసిఆర్ ఎలాగో గౌరవం ఇవ్వడం లేదని ఇక కేటీఆర్ ఏవిధంగా ఇస్తారని ఆమె నిలదీశారు. టిఆర్ఎస్ లో మహిళలు ఎంత మంది ఉన్నారని ఆమె ప్రశ్నించారు. కేటీఆర్ దృష్టిలో మహిళలంటే వ్రతాలు చేసుకుని ఇళ్లల్లో ఉండాలి అంటూ షర్మిల కాస్త ఘాటుగా స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: