దిలీప్ కుమార్ కుమార్ మరణం పై ప్రధాని సంతాపం.. !

బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ఈ రోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల నుంచి దిలీప్ కుమార్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. జూన్ 30న తీవ్ర అనారోగ్యంతో దిలీప్ కుమార్ ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో చేరారు. అప్పటినుండి ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం 7:30 నిమిషాలకు ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయన కన్నుమూశారు. బాలీవుడ్ లో  ఎన్నో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న దిలీప్ కుమార్ మరణ వార్త ఇండస్ట్రీ లో విషాదం నింపింది.


నటీ నటులు, ప్రముఖులు ఆయన మరణానికి సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా తాజాగా ప్రధాని మోడీ కూడా దిలీప్ కుమార్ మరణంపై సంతాపం ప్రకటించారు. సినిమాటిక్ లెజెండ్ గా దిలీప్ కుమార్ గుర్తుండిపోతారని మోడీ పేర్కొన్నారు. ఎంతో సృజనాత్మకతతో ఆయన దీవించబడ్డారని పేర్కొన్నారు. ఎంతోమందికి దిలీప్ కుమార్ ఇన్స్పిరేషన్ గా ఉంటారని పేర్కొన్నారు. ఆయన మరణవార్త సాంస్కృతిక ప్రపంచానికి తీరనిలోటని మోడీ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: