అజహారుద్దీన్ వర్సెస్ అపెక్స్ కౌన్సిల్..!

హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఆధిపత్య పోరు కొన‌సాగుతూనే ఉంది .  నేడు జాన్ మనోజ్ హెచ్ సీఏ హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్య‌త‌ల‌ను తీసుకుంటున్నారు. అయితే ప్ర‌స్తుతం తాను హెచ్సీఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్నందున జాన్ మనోజ్ నియామకం చెల్లదని అజహారుద్దీన్ వాదిస్తున్నారు. కానీ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు అజహారుద్దీన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలంటూ అజహారుద్దీన్ వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తుంది. హెచ్ సీఏ పరిణామాలను నిశితంగా ఎమ్మెల్సీ కవిత నిశితంగా ప‌రిశీలిస్తున్నారు . అంతే కాకుండా కాసేపట్లో జింఖానా గ్రౌండ్స్ కు ఇరు వ‌ర్గాలు చేరుకోనున్నారు . ఇదిలా ఉండ‌గా హెచ్ సీఏలో వర్గపోరు జ‌రుగుతున్న కార‌ణంగా యువ క్రికెట్ ప్లేయర్స్ అంద‌రూ ఆందోళ‌న చెందుతున్నారు . ఇదిలా ఉండ‌గా అజ‌హ‌రుద్దీన్ పై ప‌లువురు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. హెచ్ సీఏ కు వ‌చ్చిన నిధులు ఎక్క‌డ పోయాయ‌ని ప్ర‌శ్నించారు. జిల్లాల అధ్య‌క్షులను నియ‌మించ‌డంలో అగ్ర‌మాలు జ‌రిగాయ‌ని ఆరోపించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

hca

సంబంధిత వార్తలు: