దళిత మహిళ లాకప్ డెత్ సభ్యసమాజం తలదించు కోవాల్సిన ఘటన అని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు చెబితే వారం తర్వాత సీఎం స్పందించారని అన్నారు. సీఎల్పీ బృందం కలిసినప్పుడు లాకప్ డెత్ గురించి తనకు తెలియదని సీఎం అన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హత లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. దళిత సీఎం హామీ ఏమైందంటూ ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
12 శాతం జనాభా ఉన్న మాదిగలకు మంత్రిపదవి ఒక్క మంత్రి పదవి లేదని అన్నారు. మాదిగల్లో ఒక్కరికి కూడా మంత్రి అయ్యే అర్హత లేదా అని వ్యాఖ్యానిచారు. దళితుల మీద వేధింపులు పెరుగుతున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఎక్కువగా మోసపోయింది దళితులేనని అన్నారు. దళితుల సాధికారత గురించి ఇప్పుడా మాట్లాడేది అంటూ ప్రశ్నించారు.టిఆర్ఎస్, బీజేపీ దళితుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. దళితులను సీఎం చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందని చెప్పారు. దళితులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.