అక్రమాలు చేస్తున్న పోలీసుల సంగతి చెప్తాం..జ‌గ్గారెడ్డి ఫైర్.. !

తెలంగాణ‌లో పోలీసుల తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు కురిపించారు . రాష్ట్రంలో కొంత మంది పోలీసులు తీరు మార్చుకోవాలని అన్నారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. పోస్టింగుల కోసం టీఆర్ఎస్ కార్యకర్తల మాదిరిగా పని చేస్తున్నారని ఆరోపించారు. హోమంత్రి...డీజీపీ ఉన్నారా లేదా అనేది తెలియడం లేదని అన్నారు. తెలంగాణ‌లో విచిత్ర పాలన నడుస్తుందన్నారు .

పోలీసులు కొన్ని చోట్ల కనీసం ఫిర్యాదులు కూడా తీసుకోవడం లేదని ఆరోపించారు .సంగారెడ్డి జిల్లా పోలీసులు కొందరు డ్రగ్స్.. గంజాయి లాంటి వాటిని కూడా వెనకేసుకువస్తున్నారని అన్నారు. కొందరు పోలీసులు...గుర్కా లెక్క పని చేయకండన్నారు. త‌మ‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాకప్ డెత్ . అక్రమాలు చేస్తున్న పోలీసుల సంగతి చెప్తామ‌ని అన్నారు. అందరి సంగతి తేలుస్తామ‌ని...అన్ని వివరాలు తీస్తామ‌ని హెచ్చ‌రించారు .
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: