వివాదాస్పద దర్శకుడు
రామ్ గోపాల్ వర్మ సాధారణంగా ఏ సినిమాపై ప్రశంసలు కురిపించడు.
వర్మ ఒక సినిమాపై గాని ఒక నటుడి పై గాని ప్రశంసలు కురిపించడం అంటే అందులో అంతో ఇంతో మ్యాటర్ ఉంటుంది. కాగా తాజాగా
వర్మ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు....
"ఫ్యామిలీ మ్యాన్ -2 ఒక వాస్తవిక
జేమ్స్ బాండ్ లాంటింది. దాన్ని ఎప్పటికీ కొనసాగించవచ్చు.
ఫ్యామిలీ డ్రామా ను..యాక్షన్ మరియు వినోదాన్ని కలిపి చూపించడం చాలా కష్టం. అంతేకాకుండా వాస్తవికత మరియు నాటకీయత కేవలం మనోజ్ బాజ్ పాయ్ లాంటి నటుడు మాత్రమే చేయగలడు. " అంటూ
వర్మ ప్రశంసలు కురిపించాడు. ఇదిలా ఉండగా ఈ వెబ్ సిరీస్ పై ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ సిరీస్ ను నిలిపివేయాలని తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.