తెలంగాణ ఇంటర్ పరీక్షల మీద నో క్లారిటీ?
వికారాబాద్ జిల్లా: తెలంగాణలో సెకండ్ ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఎటూ తేల్చలేదని అంటున్నారు. పరీక్షల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అధికారులతో సమీక్షించిన తర్వాత పరీక్షలపై ప్రకటిస్తామని సబితారెడ్డి పేర్కొన్నట్టు తెలుస్తోంది.
ఈరోజు జిల్లాలో పర్యటించిన ఆమెను ఎంసెట్... నీట్ పరీక్షలు ఉన్నాయని...ఏ నిర్ణయం తీసుకున్నారని మీడియా ప్రతినిధులు పలుమార్లు ప్రశ్నించినా సమాధానం చెప్పకుండానే సబితారెడ్డి దాటవేసినట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఈ అంశం మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.