విదేశానికి వెళుతున్నారా...? అయితే పాస్ పోర్ట్ తో పాటు ఇది త‌ప్ప‌నిస‌రి.. !

క‌రోనా మ‌హ‌మ్మ‌రి కార‌ణంగా ప్ర‌పంచంలో ఎన్నో ర‌కాల మార్పులు వ‌చ్చాయి. అంతే కాకుండా కొత్త కొత్త రూల్స్ కూడా వ‌చ్చి ప‌డ్డాయి. ఒక‌ప్పుడు విదేశాల‌కు వెళ్లాలంటే పాస్ పోర్ట్ త‌ప్పనిస‌రి అయితే ఇప్పుడు విదేశాల‌కు వెళ్లాలంటే క‌రోనా వ్యాక్సిన్ కూడా వేసుకుని ఉండాలి. దాదాపు అన్ని దేశాలు త‌మ దేశంలోకి రావాంటే వ్యాక్సిన్ తీసుకుని ఉండాల‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయి కూడా. ఇక తాజాగా ఇదే విష‌యంపై కేంద్ర కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. 


టోక్యో ఒలింపిక్స్‌ హాజరయ్యే క్రీడాకారులు, ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లే వారు పాస్ పోర్ట్ తో పాటు కోవిడ్ టీకా సర్టిఫికెట్లు లింక్ చేయాలని పేర్కొంది. అయితే అలా చేయడం వ‌ల్ల ఇతర సర్టిఫికెట్లు చూయించాల్సిన అవసరం ఉండదని కేంద్రం స్ప‌ష్టం చేసింది. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లే వారికి టీకా ఇవ్వడంలో ప్రాధాన్యత ఇవ్వాల‌ని కూడా కేంద్రం రాష్ట్రాల‌కు సూచించింది. టీకా మొదటి డోస్ రెండో డోస్ మధ్య సమయానికి అనుగుణంగా ప్ర‌యాణీకులు  ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: