క‌న్నీళ్ల‌తో ఎస్సై కాళ్లు కడిగిన రైతు...గుండె త‌రుక్క‌పోయే స‌న్నివేశం..!

దేశానికి అన్నం పెట్టే రైతే అడుక్కునే ప‌రిస్థితి వ‌చ్చింది. తాజాగా వికారాబాద్ లో చోటు చేసుకున్న ఘ‌ట‌న చూస్తే గుండె త‌రుక్కుపోయేలా క‌నిపిస్తుంది. తాము పండించిన ధాన్యం కొనుగోలు చేయాల‌ని దోమ‌మండ‌లం పాలెప‌ల్లి వ‌రి కొనుగోలు కేంద్రం వ‌ద్ద‌ రైతులు ఆందోళ‌న‌కు దిగారు. ధాన్యం తీసుకువ‌చ్చి ప‌ది ప‌దిహేను రోజులు అవుతుందని కానీ కొన‌డంలేద‌ని..రైతులను దోచుకుంటున్నార‌ని నిర‌స‌న తెలిపారు. రోడ్డుపైనే తీసుకువ‌చ్చిన ధాన్యాన్ని ఓ రైతు త‌గ‌ల‌బెట్టేశాడు. స‌మాచారం అంద‌డంతో రైతుల నిర‌స‌న‌ను ఆప‌డానికి అక్క‌డకు పోలీసులు చేరుకున్నారు. కాగా ఆ స‌మ‌యంలో ఓ రైతు తీవ్రంగా న‌ష్ట‌పోయాన‌ని బోరున‌విల‌పించాడు. ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న ఎస్సై కాళ్లు ప‌ట్టుకుని క‌న్నీళ్లు కార్చాడు. ఈ స‌న్నివేశం చూస్తున్న వారిని కంట‌త‌డి పెట్టించే క‌నిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: