ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరగటంతో పాటు మరణాల సంఖ్య పెరగటం కూడా ఆందోళన కలిగిస్తోంది. అయితే కరోనా కట్టడికి వ్యాక్సిన్ తప్ప వేరే మార్గమే లేదని డాక్టర్లు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాక్సిన్ డోసులు వేసుకోండి ముర్రో అని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. కానీ చావనైనా చస్తాం కానీ మేం వ్యాక్సిన్లు వేసుకోం అన్న చందంగా కొందరు వ్యవహరిస్తున్నారు. వ్యాక్సిన్ శిభిరాలు నిర్వహిస్తుంటే ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. కొంతమంది సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల కారణంగా వ్యాక్సిన్ వేసుకోడానికి నిరాకరిస్తుంటే మరి కొందరు మూడనమ్మకాలతో వ్యాక్సిన్ లకు దూరంగా ఉంటున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ లోని ఓ గ్రామస్థులు వ్యాక్సిన్ లు వేసుకునేందుకు రాకపోవడంతో వారికి అధికారులు షాక్ ఇచ్చారు. గ్రామంలో కరెంట్ సప్లై ని పూర్తిగా నిలిపివేశారు. దాంతో గ్రామస్థులు రోడ్డెక్కారు. ఈ విషయంపై అధికారులను సంప్రదించగా గ్రామస్థులు కరెంట్ బిల్లులు కట్టని కారణంగానే విద్యుత్ ను నిలిపివేశామని చెబుతున్నారు. కానీ గ్రామస్తులు మాత్రం వ్యాక్సిన్ కు నో చెప్పింనందునే కరెంట్ కట్ చేసారని ఆవేదన చెందుతున్నారు.