విషాదం : కరోనాతో మరో నిర్మాత మృతి

Chaganti
కరోనా మహమ్మారి ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు సినీ సెలబ్రిటీల ఆత్మీయులను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ప్రముఖ తమిళ టెలివిజన్ సీరియల్స్ నిర్మాత కృష్ణ స్వామి కరోనా మహమ్మారి బారిన పడి నిన్న చెన్నైలో కన్నుమూశారు. కెరీర్ ప్రారంభంలో కష్టం శాఖలో ఉన్నత ఉద్యోగిగా చేసిన ఆయన ఆ తరువాత బుల్లి తెరకు నిర్మాతగా పరిచయమయ్యారు.


. అయితే గత వారం రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన స్థానిక క్రోమ్ పేట లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా విషమించడంతో గురువారం నాడు మృతి చెందారు.. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సైతం ఇప్పుడు సంతాపం తెలుపుతున్నారు. అభినయ క్రియేషన్స్‌ సంస్థ ద్వారా మాంభూమికి మామియార్, మహారాణి సెంగమలం, గ్రీన్‌ సిగ్నల్, చెల్లమ్మ, దేవతై తదితర మెగా సీరియళ్లు నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: