వీల్‌చైర్‌తో మ‌మ‌త విక్ట‌రీ?

Garikapati Rajesh

ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ ఈరోజు త‌న ఓటు హ‌క్కును వినిగియోగించుకున్నారు. కోల్‌క‌తాలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు వేశారు. కాలికి గాయం కార‌ణంగా నెల‌రోజుల నుంచి ఆమె వీల్‌చైర్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. త‌న ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు కూడా వీల్‌చైర్‌లోనే పోలింగ్‌బూత్‌కు వ‌చ్చారు. ఓటేసిన అనంత‌రం  అభిమానుల‌కు విక్టరీ సింబ‌ల్ చూపించారు. ప‌శ్చిమ‌బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో భాగంగా ఈరోజు ఏడో విడ‌త పోలింగ్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 29న తుది విడ‌త పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దీంతో ఎనిమిది ద‌శ‌ల ప‌శ్చిమ‌బెంగాల్ ఎన్నిక‌ల సుదీర్ఘ ప్ర‌క్రియ ముగియ‌నుంది. వ‌చ్చే నెల రెండోతేదీన ఓట్ల లెక్కింపు చేప‌డ‌తారు. ప‌శ్చిమ‌బెంగాల్‌తోపాటు అసోం, కేర‌ళ‌, తమిళ‌నాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు కూడా మే రెండునే వెల్ల‌డికానున్నాయి. తృణ‌మూల్ కాంగ్రెస్‌, భార‌తీయ జ‌న‌తాపార్టీ మ‌ధ్య జ‌రిగిన హోరాహోరీ పోరులో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుంద‌నే ఉత్కంఠ దేశ‌వ్యాప్తంగా నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: