భారత్‌లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండడంతో ప్రభుత్వానికి సాయం చేసేందుకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ముందుకొచ్చింది. వివిధ పారిశ్రామిక భాగస్వాములు, ఎన్‌జీవోలతో చేతులు కలిపిన అమెజాన్ 10 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, బైలెవల్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్ (బీఐపీఏపీ) మెషీన్లు భారత్‌కు త్వరితగతిన తరలించేందుకు సిద్ధమైంది. 8 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 500 బీఐపీఏపీలను సింగపూర్ నుంచి వాయుమార్గంలో భారత్‌కు తరలించేందుకు ఏసీటీ గ్రాంట్స్, టెమాసెక్ ఫౌండేషన్, పూణె ప్లాట్‌ఫామ్ ఫర్ కొవిడ్-19 రెస్పాన్స్ (పీపీసీఆర్), ఇతర భాగస్వాములతో అమెజాన్ చేతులు కలిపింది. వీటిని భారత్‌కు వీలైనంత త్వరగా తరలించేందుకు ఆయా సంస్థలన్నీ భారత్‌తో కలిసి పనిచేస్తున్నాయి. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు, పబ్లిక్ ఇనిస్టిట్యూషన్స్‌కు వీటిని విరాళంగా ఇవ్వనున్నారు.