క‌ని క‌రోనా: ప్రైవేటు దోపిడి.. ఇంత దారుణంగానా.. గంట‌ల్లో ఫీజులు

VUYYURU SUBHASH
కరోనా సమయంలో ప్రైవేట్ ఆస్పత్రిలో అందినంత మొత్తంలో దోచుకుంటున్నాయి. క‌రోనా బూచీని చూపించి.. ప్ర‌జ‌ల భ‌యాన్ని ఆస‌రాగా చేసుకుని ల‌క్ష‌ల రూపాయలు క్యాష్ చేసుకుంటున్నాయి. గంట‌ల వ్య‌వ‌ధిలో చికిత్స చేసి వేల రూపాయ‌లు ఫీజుగా క‌ట్టించు కుంటున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రుల సంగతి అటుంచితే.. చిన్నాచితకా ఆస్పత్రిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ఓ వృద్ధుడు క‌రోనాతో బాధ‌పడుతూ హాస్ప‌ట‌ల్‌కు వెళ్లాడు. అక్క‌డ కేవ‌లం గంటల వ్యవధి చికిత్స కోసం 72 వేల రూపాయలు వసూలు చేశారు. అందులో 40 వేల రూపాయలు బెడ్ చార్జెస్ కింద కట్టించుకున్నారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల కంటే ఎక్కువ చార్జీలు వ‌సూలు చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి. మ‌రి ప్ర‌భుత్వం ఈ ఆసుప‌త్రుల‌పై ఎప్ప‌ట‌కి చ‌ర్య‌లు తీసుక‌ని ఈ దోపిడి అడ్డుకుంటుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: