దేశంలో కరోనా రెండో దశ కోరలు చాస్తోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. రెండో దశను ముందే ఖచ్చితంగా అంచనా వేసి ఉంటే ఇంత ముప్పు ఉండేది కాదని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక విదేశాల్లో ఎదురైన అనుభవాలతో మూడో దశ కరోనా కూడా వస్తుందని... అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూడో దశను ముందే గుర్తించవచ్చని.. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) నిపుణులు చెపుతున్నారు.
ఇక కరోనా సోకిన వారి నాసికా ద్రవాలు, నోటి మార్గాల ద్వారానే కాకుండా... మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్ బహిర్గత మవుతుందని.. ఇక ముగురునీటి ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందని.. గుర్తించామంటున్నారు. ఐఐసీటీ, సీసీఎంబీ కలిసి గత ఆగస్టులో కోవిడ్ ఉధృతంగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లో అధ్యయనం చేశాయి.