తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీరు ఈ సంఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ప్రతిపక్ష నేతకు పూర్తి రక్షణను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్న టీడీపీ నేత వర్ల రామయ్య.. చంద్రబాబు పేరు చెపితేనే ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు. మంత్రులు రౌడీల్లాగా మాట్లాడుతున్నారని వర్ల రామయ్య అన్నారు. చంద్రబాబు పై దాడి చేసిందే కాకుండా తిరిగి తమపై నిందలను మోపుతున్నారన్నారు.