పుట్టింది మొదలు మరణించే వరకు మనిషి

Hareesh
మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. పుట్టింది మొదలు మరణించే వరకు మనిషి నిరంతర విద్యార్థి అని అన్నారు. నేషనల్ లెవల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి బాగా ఉపకరిస్తుంది అని ఒక లైబ్రరీ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేసారు. డిజిటల్ లైబ్రరీలో 13 కంప్యూటర్లు, ఫ్రీ నెట్ ఫెసిలిటీ తో పాటు నేషనల్ డిజిటల్ లైబ్రరీకి లింక్ చేసాం అని వెల్లడించారు.

అన్ని రకాల బుక్స్, లైవ్ విజువల్స్, ఇంటర్ నేషనల్ జర్నల్స్ అందుబాటులో ఉంటాయి అని తెలిపారు. తెలంగాణ వచ్చాక 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ  చేశాం.. రాబోయే రోజుల్లో మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం అని పేర్కొన్నారు. విజ్ఞానం మనిషికి తరగని నిధి.. ఎంత విజ్ఞానం సంపాదిస్తే అంతగా మనిషి ఎదుగుదల ఉంటుంది అని అన్నారు. విద్యార్థులు తమకు కావాల్సిన పుస్తకాలు, సజేషన్స్ ఉంటే వాటిని కచ్చితంగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: