క‌రోనా ఎఫెక్ట్‌... కేసీఆర్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

VUYYURU SUBHASH
తెలంగాణ‌లో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోన్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండ‌డంతో తిరిగి క్వారంటైన్ సెంట‌ర్ల‌ను ఓపెన్ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. గ‌తంలో రెడ్ జోన్లు కూడా విప‌రీతంగా ఉండేవి. ఇప్పుడు అంతా ఫ్రీ అయిపోవ‌డంతో పాటు ఎవ్వ‌రూ క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే క‌రోనా ప్ర‌భావంతో మూసేసిన క్వారంటైన్ సెంట‌ర్ల‌ను తిరిగి తెరవాలని నిర్ణయించింది.

గతంలో ఉన్న క్వారంటైన్ సెంటర్లను కరోనా తగ్గిన కారణంగా మూసివేసింది. అయితే గత కొద్దిరోజులుగా తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీతో రాష్ట్రంలోని అన్ని క్వారంటైన్ సెంటర్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ప్ర‌జ‌లు అంద‌రూ భౌతిక దూరం పాటించ‌డంతో పాటు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కూడా నిర్ణ‌యం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: