కేసీఆర్‌పై ష‌ర్మిల డైరెక్ట్ ఎటాక్‌

VUYYURU SUBHASH
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్‌. ష‌ర్మిల డైరెక్ట్ ఎటాక్ చేశారు. తెలంగాణ‌లో కొత్త రాజ‌కీయ పార్టీ పెడుతోన్న ఆమె తాజాగా ఉమ్మ‌డి మెదక్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ కే ఆయ‌న ఏం చేయలేద‌ని.. అలాంటిది తెలంగాణ‌కు ఏం చేస్తార‌ని ప్ర‌శ్నించారు. మెద‌క్ జిల్లాలోనే 20 కరువు మండలాలున్నాయని వైఎస్ షర్మిల చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉంటే మెదక్ జిల్లా రూపురేఖలే మారిపోయేవని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. మల్లన్న సాగర్ భూనిర్వాసితులకు కూడా ఇంకా పరిహారం అందలేదని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఏదేమైనా నిన్న‌టి వ‌ర‌కు కేసీఆర్‌ను ప‌రోక్షంగా టార్గెట్ చేస్తూ వ‌చ్చిన ష‌ర్మిల ఇప్పుడు డైరెక్ట్ ఎటాక్ ప్రారంభించ‌డంతో పొలిటిక‌ల్ కాక మొద‌లైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: