ఏపీలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌కు ముహూర్తం ఫిక్స్‌

VUYYURU SUBHASH
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు గ‌త యేడాది కాలంగా నామినేష‌న్ల ప‌ర్వం ముగిసి ఆ మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి. క‌రోనా త‌ర్వాత వ‌రుస‌గా స‌ర్పంచ్‌, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రిగినా ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు మాత్రం జ‌ర‌గ‌లేదు. ఇక కొత్త సీఎస్‌గా నీలం సాహ్నీ కూడా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. ఇక మ‌ళ్లీ ఈ ఎన్నిక‌ల‌కు ముహూర్తం ఫిక్స్ కానుంది.

ఏప్రిల్ మొదటి, రెండో వారంలో జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏప్రిల్ 8వ తేదీ లేదా పదో తేదన ఎన్నికలు జరిగే అవకాశముంది. నీలం సాహ్ని ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. కేవలం ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే ఉండటంతో ఈ ఎన్నికలను వెంటనే పూర్తి చేసి కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: