2021-22 దుర్గ‌గుడి బ‌డ్జెట్ ఓకే... ఎన్ని కోట్లో తెలుసా..‌

VUYYURU SUBHASH
ఏపీలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క ఆల‌యాల్లో ఒక‌టి విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రి ఆల‌యం. ఈ క్ర‌మంలోనే ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ఆల‌య బ‌డ్జెట్‌కు పాల‌క మండ‌లి ఆమోదం తెలిపింది. 2021-22 ఏడాదికి గాను రూ.178కోట్ల బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపినట్లు దుర్గగుడి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు తెలిపారు. పాలక మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

అలాగే విజయవాడ మీదుగా వెళ్లే రైలుకు కనకదుర్గ ఎక్స్‌ప్రెస్‌ పేరు పెట్టాలని రైల్వేశాఖను కోరతామని ఆయ‌న చెప్పారు. అలాగే విజయవాడ నగరంలోని ముఖ్యకూడళ్లలో ఆలయం తరఫున ఆర్చ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇకపై ప్రతి నెలా మూడో వారంలో పాలకమండలి సమావేశం నిర్వహిస్తామని.. కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై భక్తుల కోసం అన్ని చర్యలు చేపట్టినట్లు సోమినాయుడు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: