అసెంబ్లీ ని ముట్టడించిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు..నెలకొన్న ఉద్రిక్తత !!

KISHORE
 తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు 7వ రోజు కొనసాగుతున్నాయి. తాజాగా నేడు అసెంబ్లీ పై రాజకీయ నేతలతో పాటు సామాన్య ప్రజలు కూడా దండెత్తారు. కరీంనగర్ అభివృద్ది ని సి‌ఎం కే‌సి‌ఆర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ వద్ద నిరసన కు దిగారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మద్య తోపులాట జరగడం వల్ల పొన్నం ప్రభాకర్ కు చిన్నపాటి గాయాలు అయ్యాయి. అలాగే వేముల వాడ, జగిత్యాల ప్రజలు కూడా అసెంబ్లీ ని ముట్టడించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.ఉన్నట్లు తెలిసింది అలాగే బీజేపీ నేతలు ఎస్సీ మోర్చా ఆద్వర్యంలో అసెంబ్లీ ముందు నిరసనలు చేపట్టారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తూ.. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లవుతున్న ఇంతవరకు అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు మొదలు కాకపోవడంపై వారు అసెంబ్లీ ముందు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎస్సీ మోర్చా ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అసెంబ్లీ వద్ద ఉద్రిక్త
పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అసెంబ్లీ  ప్రాంpతాలలో పోలీసులు భద్రత పెంచారు.   . 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: