అమరావతికి జగన్ మరో షాక్ ఇచ్చారా...?
పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. అమరావతి మహా నగరపాలక సంస్థ ప్రతిపాదనకు ప్రభుత్వం చరమగీతం పాడింది అనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక అమరావతి ఊసే లేకుండా చేసే కుట్ర ఉందనే అనుమానం వ్యక్తం చ్చేస్తున్నారు. మంగళగిరి, తాడేపల్లి మునిసిపల్ పట్టణాల సహా వాటి చుట్టుపక్కల ఉన్న 21 గ్రామాలను కలిపి మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్(ఎంటీఎంసీ) ఏర్పాటు చేసారు. మంగళగిరి మండలంలో 14 గ్రామాలు ఉండగా కృష్ణాయపాలెం, నీరుకొండ, కురగల్లును మినహాయించి మిగతా 11 గ్రామాలు కార్పొరేషన్ పరిధి కిందకు తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లి పట్టణంతో పాటు ఆ మండల పరిధిలోని పది గ్రామాలను కార్పొరేషన్ కిందకు వస్తాయి.