రజనీకాంత్‌కు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
ఈ షూటింగ్ సెట్‌లో ఏడుగురికి కరోనా సోకినట్లు తేలడంతో అర్థాంతరంగా షూటింగ్ నిలిపివేశారు. 4 వారాల పాటు వాయిదా వేశారు. చిత్ర యూనిట్‌తో పాటు రజినీ కాంత్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడం అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఇదిలా ఉంటే గతంలో కూడా రజినీ కాంత్ అనారోగ్యంతో బాధపడ్డారు. అయితే పూర్తిగా కోలుకుని తిరిగివచ్చారు. ప్రస్తుతం రాజకీయంగా కూడా వేగంగా అడుగులు వేస్తున్నారు. మండ్రం నాయకులతో కలిసి అనేక సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే ఇలాంటి సందర్భంలో ఆయన ఉన్నట్లుండి అనారోగ్యానికి గురవడం అభిమానుల్లో ఆందోళన కనిపిస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య కూడా ఇక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.
హైబీపీ, నిస్సత్తువ(ఎగ్జార్షన్) వంటి ఆరోగ్య సమస్యలతో రజినీ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతంరజినీని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నామని, అయితే రెండు రోజులు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రాణహాని ఏమీ లేదని చెబుతున్నారు. అయితే పూర్తి సమాచారం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
శుభవార్త ఏంటంటే వైద్యులు రజినీ కాంత్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో నెగెటివ్ వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం ఆయన అభిమానులకు కొంత ఊరటనిస్తోంది. అయితే ఆయన ఆరోగ్యం బాగుపడాలని, త్వరగా కోలుకుని రావాలని వారంతా దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇదిలా ఉంటే రజినీకి దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. దీంతో ఆయన అనారోగ్యం వార్త తెలిసిన అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆసుపత్రి పరిధిలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.