ఎన్‌కౌంటర్‌లో నలుగురు జవాన్లు వీరమరణం..!
శనివారం అర్ధరాత్రి నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. అమరులైన వారిలో ఓ ఆర్మీ అధికారి సహా ముగ్గురు జవాన్లు ఉన్నట్లు ఆర్మీ ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన వెల్లడించారు.