హైదరాబాద్ లో భారీ షాక్ ఇచ్చిన కంపెనీ...!

హైదరాబాదులో మరో కంపెనీ షాక్ ఇచ్చింది. డిక్యు ఎంటటైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ (అనిమేషన్) బిచానా సర్దుకుంది. కంపెనీ దివాలా తీసిందని ట్రిబ్యునల్ పిటీషన్ ని డిక్యు ఎంటటైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ (అనిమేషన్) దాఖలు చేసింది. ఈ నిర్ణయంతో 1400 మంది రోడ్డున పడ్డారు.  గత ఎనిమిది నెలల నుంచి ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు ఈ సంస్థ.

తమకు న్యాయం చేయాలంటూ పోలీసులు, మానవ హక్కుల సంఘాన్ని ఉద్యోగులు ఆశ్రయించారు.  సంస్థపై సిసిఎస్ లో ఫిర్యాదు చేసారు. ఎండి తపాస్ చక్రవర్తిపై చర్యలు తీసుకొని... తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఆ కంపెనీ ఉద్యోగులు ఫిర్యాదు చేసారు. ఇప్పటి వరకు ఒక్కొక్కరికి 14 లక్షలు రావాలని ఆవేదన వ్యక్తం చేసారు. ఎండి పై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: