దుబ్బాక ఎన్నికల ముందు తెరాసకు షాక్...!

దుబ్బాక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ లో సస్పెన్స్ కొనసాగుతుంది. ఎవరికి అవకాశం ఇస్తారు అనేది స్పష్టత రాలేదు. చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరువు శ్రీనివాస్ రెడ్డితో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతుంది. ఈరోజు ఉదయం వరకు డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి  నే అభ్యర్థిగా ప్రకటించాలని  పిసిసి నిర్ణయం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో టచ్ లోకి వచ్చారు చెరుకు శ్రీనివాసరెడ్డి.

దుబ్బాక ఎన్నికల్లో తన పేరు అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీ లోకి వస్తానని షరతు పెట్టిన చెరుకు శ్రీనివాసరెడ్డితో కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో రహస్య మంతనాలు జరుపుతున్నారు చెరుకు శ్రీనివాస్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే మాత్రం తెరాస పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: