మోదీ పై కోపాన్ని.. మన్మోహన్ సింగ్ పై ప్రేమగా మార్చిన యువరాజు..!
ప్రతి భారతీయుడి క్షేమాన్ని కాంక్షించే మన్మోహన్ సింగ్ అంకితభావాన్ని అంతా వేడుకగా నిర్వహించుకుంటున్నారని కాంగ్రెస్ పేర్కొంది. గొప్ప ప్రయాణం దిశగా ఆయన అందరినీ కలుపుకొని వెళ్లారని తెలిపింది. భారతదేశ గొప్ప పుత్రుడికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని కాంగ్రెస్ వెల్లడించింది.మన్మోహన్ సింగ్ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. పీవీ నర్సింహరావు ప్రభుత్వంలో విత్తమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకురావటంలో కీలక పాత్ర పోషించారని కీర్తించారు. ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.