బ్రేకింగ్ : ప్ర‌ణ‌బ్ మృతిపై సంతాప తీర్మానాన్నిప్రకటించిన రాష్ట్ర సీఎం కేసీఆర్!

Edari Rama Krishna
తెలంగాణ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టీ నుంచి శాసనమండలి, శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 19 పనిదినాలు సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా విజృంభన, శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ప్రమాదం, జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్రం వైఖరి, రాయలసీమ ఎత్తిపోతల తదితర అంశాలు సమావేశాల్లో ప్రస్తావనకు రానున్నట్టు తెలుస్తోంది. కొత్త రెవెన్యూ చట్టం బిల్లు కూడా ఈ సమావేశాల్లోనే ఉభయసభల ముందుకు రానుంది. భార‌త‌ర‌త్న, మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ సంతాపం తెలిపింది.


ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల సంతాప తీర్మానాన్నిరాష్ట్ర  సీఎం కేసీఆర్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌స‌భ ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నామ‌ని తెలిపారు. భార‌త‌దేశం శిఖ‌ర స‌మాన‌మైన నాయ‌కుడిని కోల్పోయింది. ప‌్ర‌పంచంలోనే ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప్ర‌ముఖ ఆర్థిక‌వేత్త‌గా పేరు తెచ్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: